Tuesday, April 17, 2012

padyam

పద్యమ్ము నేవడురా  పాతిపెట్టేదనంచు 
                ఉన్మాదియై ప్రేలుచున్నవాడు 
పద్యమ్ము నేవడురా ప్రాతవడ్డది యంచు 
                వెఱ్రివాడై విర్రవీగు వాడు 
పద్యమ్ము ఫలమురా పాతిపెట్టిన పెద్ద
                వృక్షమై పండ్ల వేవేల నొసగు 
పద్యమ్ము నెప్పుడో పాతి పెట్టితిమేము 
                లోకుల హృదయాల లోతులందు 
ఇప్పుడద్దాని పెకలింప నేవారి తరము
వెలికి తీసి పాతుట ఎంత వెర్రి తనము
నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచి
బాల్య చాపల్యమునకెంత వదరుతనము!!
                                                                     గురు సహస్రావధాని డా.కడిమిళ్ళ వర ప్రసాద్ 
    3-6-50. yarramilli vari street. Narasapur. 534275. W.G.Dt. A.P, INDIA. CELL. 9247879606. 
    Ph. 8814274876. emails. kadimilla@yahoo.com, kadimillavaraprasad@gmail.com


Wednesday, March 21, 2012

ఆదౌ పూజ్యో గణాధిప:

పెద్దది పొట్ట విద్దియల పెట్టియగా నిడుపాటి తొండమా
బుద్దులకెల్ల ఊపిరియ పూజ్యుల పల్కుల నాలకింపగా 
పెద్దవి యైన వీనులును పిన్నలు కన్నులు బాహ్య దృష్టియే
వద్దనుచున్న యొజ్జలగు వాడు గణాధిపుడిచ్చు దీవెనల్