Tuesday, April 17, 2012

padyam

పద్యమ్ము నేవడురా  పాతిపెట్టేదనంచు 
                ఉన్మాదియై ప్రేలుచున్నవాడు 
పద్యమ్ము నేవడురా ప్రాతవడ్డది యంచు 
                వెఱ్రివాడై విర్రవీగు వాడు 
పద్యమ్ము ఫలమురా పాతిపెట్టిన పెద్ద
                వృక్షమై పండ్ల వేవేల నొసగు 
పద్యమ్ము నెప్పుడో పాతి పెట్టితిమేము 
                లోకుల హృదయాల లోతులందు 
ఇప్పుడద్దాని పెకలింప నేవారి తరము
వెలికి తీసి పాతుట ఎంత వెర్రి తనము
నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచి
బాల్య చాపల్యమునకెంత వదరుతనము!!
                                                                     గురు సహస్రావధాని డా.కడిమిళ్ళ వర ప్రసాద్ 
    3-6-50. yarramilli vari street. Narasapur. 534275. W.G.Dt. A.P, INDIA. CELL. 9247879606. 
    Ph. 8814274876. emails. kadimilla@yahoo.com, kadimillavaraprasad@gmail.com


3 comments:

  1. కడిమిళ్ళ వరప్రసాద్‌ శతావధాని గారికి స్వాగతం :)
    కడిమిళ్ళ కవనం అనగానే ఈ బ్లాగు మీదే అయివుండాలి అనుకున్నాను.

    ReplyDelete
  2. మొన్న డల్లాసులో జరిగిన వీరి అవధానములో ఇదే పద్యానికి సంబంధించిన సమస్యను ఇచ్చాము. వారి పూరణ:
    హృద్యముగా కవిత్వము వచించు సమర్థుడు పండితుండు నై
    వేద్యము చేయ భారతికి విజ్ఞతతో నిలుచున్న వేళ సా
    రధ్యము సేయగా గురుడు రాజిలి గుండెల లోతులందులన్
    పద్యము పాతిపెట్టెనట పండితుడైన వరప్రసాదుడే

    ReplyDelete
  3. Sir,
    namaskaaram.
    chaalaa baagumdi padyam goppatanam bahu baagaa varnimchaaru.

    telugu andubaatulo ledu. kshaminchagalaru.

    ReplyDelete